V6 News

గాంధీలో రోగులకు ఉచిత న్యాయ సహాయం.. ప్రతి శనివారం లీగల్ హెల్ప్‌‌‌‌ డెస్క్

గాంధీలో రోగులకు ఉచిత న్యాయ సహాయం.. ప్రతి శనివారం లీగల్  హెల్ప్‌‌‌‌  డెస్క్

పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో వచ్చిందని సూపరింటెండెంట్​డా.వాణి తెలిపారు. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేను పురస్కరించుకొని శుక్రవారం గాంధీలో స్పెషల్ లీగల్ హెల్ప్ ప్రోగ్రామ్ నిర్వహించారు. 

సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ప్రతి శనివారం ఓపీ విభాగంలో ఫ్రీ లీగల్ హెల్ప్‌‌‌‌ డెస్క్ పనిచేస్తుందని, రోగులు, సహాయకులు వినియోగించుకోవాలని సూచించారు. లీగల్ సెల్ లాయర్ జగదాంబ మాట్లాడుతూ..  ప్రతి రోగికి చికిత్స చేసుకునే హక్కు ఉందని, వారికి నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం ఔట్ పేషెంట్​విభాగంలో గర్భిణిలకు పలు సలహాలు ఇచ్చారు. ఆర్‌‌‌‌ఎంవోలు డా. శేషాద్రి, కల్యాణ డా.చక్రవర్తి, డా.యోగేందర్, డా.నవీన్పాల్గొన్నారు.