
ఎల్బీనగర్, వెలుగు: హైదరాబాద్ ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్లో తలసేమియా బాధితులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ పిల్లల వైద్య విభాగాధిపతి, సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రీషియన్ డాక్టర్ ఎస్. నరసింహారావు తెలిపారు. బుధవారం (May 21) ఆయా విభాగాల అధిపతులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.
తలసేమియా లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన చికిత్స ప్రారంభిస్తే పిల్లల ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శిబిరంలో పిల్లలకు పలు విభాగాల డాక్టర్లు పరీక్షలు చేస్తారని తెలిపారు. ఉచితంగా పరీక్షలు చేయించుకోవాలనుకునే వారు 8985450534 నంబర్ లో సంప్రదించాలని సూచించారు.