తెలంగాణ నుంచి అయోధ్య వరకు ఫ్రీ ట్రైన్.. ఏ జిల్లా నుంచి అంటే..!

తెలంగాణ నుంచి అయోధ్య వరకు ఫ్రీ ట్రైన్.. ఏ జిల్లా నుంచి అంటే..!

 

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించేందుకు మరింకొంత సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా రామ నామ సంకీర్తనలు మారుమోగుతున్నాయి. అయోధ్యలోని ఆ రామయ్యను దర్శించుకునేందుకు తమకెప్పుడు ఆ భాగ్యం కలుగుుతుందో అని ప్రజలంతా తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే అయోధ్యకు వెళ్లాలనుకునే భక్తులకు బీజేపీ పార్టీ గుడ్ న్యూస్ చెప్పింది.  

నల్లగొండ నుంచి అయోధ్య వరకు ఫ్రీ ట్రైన్ ను నడపనున్నట్టు నల్లగొండ బీజేపీ ఇంఛార్జీ వర్షిత్ రెడ్డి చెప్పారు. ఫిబ్రవరి నాలుగొవ తేది నాడు నల్లగొండ రైల్వేస్టేషన్ నుంచి ఈ రైలు బయల్దేరుతుందని అన్నారు. 14 వందల మందితో ఈ ట్రైన్ వెళ్లబోతున్నట్టు తెలిపారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి మొదటి వారంలో నల్లగొండకు రానున్నట్టు చెప్పారు. ఆయన చేతుల మీదుగానే ఈ రైలును ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ రైలు రాముడి భక్తలకు ఒక గిఫ్ట్ లాంటిదని వర్షిత్ రెడ్డి అన్నారు.