బస్ స్టాండ్లలో ఫ్రీ వైఫై: TS RTC

బస్ స్టాండ్లలో ఫ్రీ వైఫై: TS RTC

ప్రజలకు ఉన్న ఇంటర్నెట్ అవసరాన్ని గుర్తించిన ఆర్టీసీ స్టేషన్లలోనూ ఫ్రీ వైఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు ప్రారంభమయ్యాయి. ఇక బస్టాండ్ లలో కూడా ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తీసుకురానుంది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. దీనికోసం BSNL తో చర్చలు జరుపుతోంది ఆర్టీసీ. ప్రయోగాత్మకంగా 8 స్టేషన్లలో అందించాలని చూస్తోంది. మొదట ఈసీఐఎల్, దిల్ సుఖ్ నగర్, పటాన్ చెరువు వంటి 8 బస్ స్టేషన్లలో ఉచిత వైఫై సేవలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 358 బస్సు స్టాండ్ లలోనూ, హైదరాబాద్ వరంగల్ లాంటి మహానగరాల్లో 1124 బస్ షెల్టర్లు ఉండగా వాటిలో ప్రయాణికుల రద్దీని ప్రామాణికంగా తీసుకొని ప్రధానమైన స్టేషన్లలో ఈ వైఫై సేవలను అందించాలని నిర్ణయించుకుంది TS RTC. ప్రస్తుతం ఈ విషయంలో BSNL తో చర్చలు జరుపుతున్న ఆర్టీసీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే ఐటీ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది.