కరోనా కట్టడికి : పీఎం సహాయనిధికి ఫ్రీడం ఆయిల్ సంస్థ విరాళం

కరోనా కట్టడికి :  పీఎం సహాయనిధికి  ఫ్రీడం ఆయిల్ సంస్థ విరాళం

కరోనా కట్టడికి సామాన్యులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ తయారీ సంస్థ జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రధానమంత్రి సహాయ నిధికి రూ. 50లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది.

ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ చౌదరి కరోనా వైరస్ మహమ్మారి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని సూచనలతో కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో వంట నూనెల్ని సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు తమ సంస్థ సభ్యులు సైతం ముందుకొచ్చారని తెలిపారు.
జీఈఎఫ్ (జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) కు చెందిన 640మంది ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని కరోనాను వైరస్ అరికట్టేందుకు ఇచ్చారని, మొత్తం 9.25లక్షల్ని పీఎం సహాయనిధికి అందించినట్లు ఫ్రీడం హెల్తీ కుకింగ్ ఆయిల్ తయారీ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ ప్రదీప్ చౌదరి వెల్లడించారు.