వెయ్యి మంది టీజీవో అధికారుల ఫ్రీడమ్ వాక్

వెయ్యి మంది టీజీవో అధికారుల ఫ్రీడమ్ వాక్

భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత ఆధ్వర్యంలో ఫ్రీడమ్ వాక్  ప్రారంభమైంది.  హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా వరకు  నిర్వహించిన ఫ్రీడమ్ వాక్ లో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ వాక్ లో సుమారు 1000 మంది టీజీవో అధికారులు పాల్గొన్నారు. అనంతరం TGO లతో కలసి ఫ్రీడమ్ వాక్ లో భాగంగా గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ వరకు మంత్రి  వాక్ చేశారు. 

ఈ కార్యక్రమంలో టీజీవో ముఖ్య నాయకులు సత్యనారాయణ, పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, సహదేవ్, రవీందర్ రావు, MB కృష్ణయాదవ్, గండూరి వెంకట్, చంద్రయ్య, B.  వెంకటయ్య, డా. హరికృష్ణ, సుజాత, శ్రీలీల, లక్ష్మణ్ గౌడ్, పీసీ వెంకటేష్, పూనమ్, జ్యోతి, లావణ్య తదితర సంఘాల నాయకులు, అధికారులు  పాల్గొన్నారు.