ఈస్ట్ వెస్ట్ సీడ్ నుంచి కొత్త టమాటా

ఈస్ట్ వెస్ట్ సీడ్ నుంచి కొత్త టమాటా

హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా అనేక రకాలుగా నస్టపోయిన చిన్న కమతాల టమాట రైతులకు మేలు చేసే విత్తనాలను ప్రవేశపెట్టినట్టు ఈస్ట్ వెస్ట్ సీడ్ ఇండియా తెలిపింది. శ్రేయా, రియా అనే ఈ విత్తనరకాలు అధిక దిగుబడినిస్తాయని తెలియజేసింది. పరిమాణం, రంగులో ఒకే తరహాలో ఉండడమేగాక సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లినా చెడిపోవని పేర్కొంది. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రద్ శ్ లో జూలై నుంచి డిసెంబర్ దాకా సాగు చేసేందుకు ఈ సంకరజాతి విత్తనాలు అనువుగా ఉంటాయి. ఎండాకాలం, వర్షాకాలం….రెండు కాలాల్లోనూ సాగుచేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఈస్ట్ – వెస్ట్ సీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ రాజన్ మాట్లాడుతూ ” మా సంకరజాతి విత్తనాలు ఎక్కువ దిగుబడిని అందించడం మాత్రమే కాకుండా చీడపీడలను తట్టుకుంటాయి. ఇతర రకాల కంటే ఎక్కువ రుచిని ఇస్తాయి” అని వివరించారు.