
న్యూఢిల్లీ: ఒరిజినల్ ఆఫర్ లెటర్‌లో చెప్పిన దాని కంటే తక్కువ శాలరీకే జాబ్స్ ఇవ్వగలమని విప్రో పేర్కొన్నప్పటికీ ఫ్రెషర్లు ఎగబడ్డారు. తగ్గించిన శాలరీని 92 శాతం మంది ఫ్రెషర్లు అంగీకరించారని విప్రో సీఎఫ్‌ఓ జతిన్ దలాల్ పేర్కొన్నారు. తొందరగా జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు వీరు కంపెనీ కండిషన్లను అంగీకరించారని తెలిపారు.
కాగా, ఒరిజినల్‌గా ఫ్రెషర్లకు రూ.6.5 లక్షలు ఆఫర్ చేయగా, ఈ శాలరీ ప్యాకేజిని తర్వాత రూ.3.5 ల క్షలకు తగ్గించారు. జాబ్‌లో జాయిన్ అయ్యేందుకు ఎదురుచూస్తున్న ఫ్రెషర్లకు శాలరీకి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరిలో విప్రో మెయిల్ పంపింది. తక్కువ శాలరీకి రావాలనుకునే వారు తొందరగా జాబ్‌లో జాయిన్ అవుతారని ఇందులో పేర్కొంది. ఒరిజినల్ ఆఫర్ కోసం వెయిట్ చేసేవాళ్లు వెయిట్ చేయొచ్చని తెలిపింది. కానీ, వీరు ఎప్పుడు జాయిన్ అవ్వాలో డేట్ ఇవ్వలేదు. బిజినెస్ అవసరాలకు తగ్గట్టు ఉద్యోగులను హైరింగ్‌లో మార్పులు చేస్తున్నామంది.