ఫ్రైడ్ ఇడ్లీలు.. పాల ముంజెలు..పేర్లు వినే ఉంటారు.. ఒకదానికొకటి సంబంధం లేదు కదా.. కానీ వండటానికి ఎప్పుడైనా ట్రైచేశారా? అలాగే వీటి రుచుల విషయంలో కూడా సంబంధం ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటి వంటలు చేసి పెడితే పిల్లలు లాగించేస్తారు
ఫ్రైడ్ ఇడ్లీలు ఇడ్లీలు తయారీకి కావలసినవి
ఇడ్లీలు: 5
కరివేపాకు: రెండు రెమ్మలు
జీలకర్ర :ఒక్కటీ స్పూన్
కారం :రెండు టీ స్పూన్లు
ఆమ్ చూర్ పొడి: ఒక టీ స్పూన్
సాంచారు మసాలా పొడి :ఒక టీ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె :రెండు లేదా మూడు టీ స్పూన్లు
ఫ్రైడ్ ఇడ్లీలు తయారీ విధానం
ముందుగా ఇడ్లీలను ముక్కలు గా కోసి పక్కన పెట్టాలి. పాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగించి ఇడ్లీ ముక్కలు వేసి సన్నని మంటతో రెండు నిమిషాలు వేగించాలి.
తర్వాత వాటిలో కారం. అమ్చూర్ పొడి, సాంబారు పొడి, ఉప్పు వేసి కలిపి వేగిస్తే గరమ్ గరమ్ ' ఫ్రైడ్ ఇడ్లీలు రడీ రెడీ. క్యాలరీస్ తో సంబందం లేకుండా రుచి కోసం అయితే ఇది చాలా బాగుంటుంది
పాలముంజెలు తయారీకి కావలసినవి
గోధుమ రవ్వ లేదా బొంబాయి రవ్వ : అర కప్పు
చక్కెర: ఒక కప్పు
వేడి పాలు :ఒక కప్పు
బాదం, జీడిపప్పు పొడి: రెండు టేబుల్ స్పూన్లు
యాలకుల పొడి: ఒక టీస్పూన్
నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము: ఒక కప్పు
ఉప్పు :పావు టీ స్పూన్
నూనె :తగినంత
పాలముంజులు తయారీ విధానం
న్దన్ పాన్ పెట్టి చక్కెర నీళ్లు వేసి పాకం పట్టాలి. చక్కెర పాకం వచ్చాక కొబ్బరి వేసి ఉడికించాలి. తర్వాత బాదం, జీడిపప్పు పొడి ఉడికించాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోతీసుకుని చల్లారబెట్టాలి. అదే పాన్లో పాలు పోసి వేడి చేసి గోధుమ రవ్వ, ఉప్పు వేసి ఉడికించా లి.
మెత్తగా ఉడికిన పిండిలో నెయ్యి వేసి కలపి ఒక గిన్నెలోకి తీసుకుని ఐదు నిమిషాలు చల్లార్చాలి.
తరువాత చేతులకు నెయ్యి రాసుకుని పిండిని పూరీలా ఒత్తి మధ్యలో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి గుండ్రంగా చుట్టాలి.
అలా మట్టిన ఉండలను బాండీలో నూనెపోసి వేగిస్తే రుచికరమైన 'పాల ముంజెలు రడీ.. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి..
–వెలుగు,లైఫ్–
