మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి లీడ్ రోల్స్‌లో రూపొందుతున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. శ్రీకర్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, బుధవారం మూడో పాటగా ‘ఫ్రెండ్‌షిప్’ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సింజిత్ యెర్రమల్లి కంపోజ్ చేయగా, శ్రీ రామ చంద్ర పాడారు.
ఈ పాట పల్లవికి పూర్ణాచారి సాహిత్యం అందించగా, చరణం, హుక్ లైన్ కిట్టు విస్సాప్రగడ రాశారు. ‘‘ఓ రెండు తోకచుక్కలు తొడిగాయి చిన్ని రెక్కలు, గోదారి దారిపొడవునా ఎగిరాయే, ఆ పాల బోసినవ్వులు, అల్లరి తారాజువ్వలు, ఊరంతా కొత్త సందడే చేశారే, యేటి గట్టులో, మావి చెట్టులో, నీటి తొట్టిలో వీరే..” అంటూ చిన్ననాటి జ్ఞాపకాలతో సాగిన సాహిత్యం ఆకట్టుకుంది. జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో విడుదల కానుంది.
