బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో కప్ప కలకలం

బాసర ట్రిపుల్ ఐటీ మెస్ లో కప్ప కలకలం

నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ మెస్ వంటలో కప్ప కలకలం రేపింది.  స్టూడెంట్స్ కోసం చేసిన  ఆలూ కుర్మాలో ఫ్రై అయిన కప్ప ప్రత్యక్షమైంది. కూరలో కప్పను చూసిన విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన సిబ్బంది.. మెస్ కాంట్రాక్టర్ కు నోటీసులు ఇచ్చారు. ఐతే కూర వండే సమయంలో నీళ్లలో నుంచి కప్ప వచ్చి ఉంటుందని ప్రాథమిక నిర్దారణకు వచ్చారు.  ఆలు కర్రీ తిన్న విద్యార్థులు క్షేమంగానే ఉన్నట్టు అధికారులు స్పష్టంచేశారు. ట్రిపుల్ ఐటి కాలేజ్  మెస్ లో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. నాణ్యత లేని భోజనం పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.

అరంగేట్రంలోనే భారత బౌలర్ హాఫ్ సెంచరీ