అరంగేట్రంలోనే భారత బౌలర్ హాఫ్ సెంచరీ

అరంగేట్రంలోనే భారత బౌలర్  హాఫ్ సెంచరీ

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.  టాస్‌ గెలిచి భారత మహిళల జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లతో 7 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసింది. ప్రారంభంలోనే షఫాలీ వర్మ ఔటయినప్పటికీ ..స్మృతి మంధాన(52 ) దీప్తి శర్మ ఆచితూచి ఆడారు. ఈ క్రమంలోనే స్మృతి హాఫ్ సెంచరీ చేసింది. ఆ తర్వాత ఆమె ఔట్ కావడంతో .. వరుస వికెట్లు కోల్పోయి 114/6 పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను  పూజా వస్త్రాకర్‌(67),స్నేహ్‌ రానా(52) చెరో హాఫ్ సెంచరీలతో అదుకున్నారు. భారత బౌలర్‌ పూజా వాస్త్రాకర్‌ దుమ్ము రేపింది. వరల్డ్ కప్ అరంగేట్రంలోనే  విరోచిత ఇన్నింగ్స్‌తో ఆడింది.  59 బాల్స్ లో 67 రన్స్ చేసింది. అఖరి ఓవర్‌లో సానా బౌలింగ్‌లో వాస్త్రాకర్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యింది.