వానల కోసం కప్పల పెళ్లి

వానల కోసం కప్పల పెళ్లి

వానల కోసం కరీంనగర్ లో కప్పల పెళ్లి చేశారు జనం. మానకొండూరు మండలం శ్రీనివాస నగర్ గ్రామంలో సకాలంలో వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేశారు. వాన కాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా… వర్షాలు పడకపోవటంతో… ఈ కార్యక్రమం నిర్వహించారు. గ్రామస్తులంతా కప్పలను కర్రలకు కట్టి ఊరిలో ఇంటింటికి తిరిగారు. మహిళలను బిందెలతో నీళ్లు తెచ్చి కప్పలపై పోసి వరుణ దేవుడిని వేడుకున్నారు. ఇప్పటికే సాగుతో పాటు తాగు నీరు దొరక్క కష్టాలు పడుతున్నామంటున్నారు గ్రామస్తులు.