చదువు తప్ప మరో ప్రపంచం తెలియని వయసు. ఎంతో కష్టపడి రాసిన పరీక్ష ఫలితాలు తారుమారవటంతో.. OSM మూల్యాంకన పద్ధతి కారణంగా.. వేరొకరి పేపర్ రావడంపై ఆ విద్యార్థి ప్రశ్నించాడు. ఇది నా పేపర్ కాదు.. నా హ్యాండ్ రైటింగ్ కాదు.. సీబీఎస్ఈ లో పెద్ద తప్పు జరుగుతోందని కంప్లైంట్ రైజ్ చేయడం ఆ విద్యార్థి చేసిన తప్పు. సీబీఎస్ఈ తప్పు అంగీకరించి మళ్లీ పేపర్ కరెక్షన్ చేసేందుకు ఒప్పుకుంది కానీ.. సంబంధం లేని వ్యక్తులు ఆ విద్యార్ధిపై ట్రోలింగ్ కు దిగటం సంచలనం మారింది. ఒక వ్యవస్థ తప్పను ప్రశ్నిస్తే ఏకంగా పాకిస్తానీ అంటూ ముద్ర వేయటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సీబీఎస్ఈ క్లాస్ 12 విద్యార్థి వేదాంత్ శ్రీవాత్సవ సోషల్ మీడియాలో ఘోరమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు. ఫిజిక్స్ ఆన్సర్ షీట్ మిస్ మ్యాచ్ అవ్వడంతో సీబీఎస్సీని ప్రశ్నించినందుకు పాకిస్తానీ అనే ముద్ర వేయించుకున్నాడు.
సీబీఎస్ఈ ఫలితాలలో OSM మూల్యాంకన పద్ధతిలో జరిగిన తప్పుల వలన.. ఫలితాలు తారుమారైన విషయం తెలిసిందే. ఒక విద్యార్థి పేరుకు వేరొకరి పేపర్ దర్శనమివ్వటం.. మార్కులు తారుమారవ్వటమే కాకుండా.. మొత్తం ఫలితాలపైనే ప్రభావం చూపింది. 2026 సంవత్సరానికి మొత్తం రిజల్ట్స్ లో 3.19 శాతం తగ్గి 85.20 గా ఫలితాలు వ చ్చాయి. ఈ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.
- ఏంటి వేదాంత్ శ్రీవాస్తవ కేసు..?
2026 మే 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను విడుదల చేసినప్పుడు, ఫిజిక్స్‌లో తనకు ఊహించని విధంగా తక్కువ మార్కులు వచ్చాయని ఢిల్లీకి చెందిన విద్యార్థి వేదాంత్ శ్రీవాత్సవ అనుమానం వ్యక్తం చేశాడు. ఏదో తేడా జరిగిందని మే 19న తన ఆన్సర్ షీట్స్ స్కాన్ కాపీలను కోరాడు. మే 23న స్కాన్ చేసిన కాపీలను అందుకున్న తర్వాత, తన రోల్ నంబర్‌కు అటాచ్ చేసిన ఫిజిక్స్ పత్రం తనది X లో పోస్ట్ చేశాడు. ఫిజిక్స్ పేపర్ లో ఉన్న చేతి రాత తనది కాదని.. అందుకు సంబంధించిఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ పేపర్ల నుండి పక్కపక్కనే ఉన్న స్క్రీన్‌షాట్‌లను అప్‌లోడ్ చేశాడు.
ఏడాది మొత్తం చదివాను. ఈ పరీక్షల కోసం నిద్ర మానేసి, బయటకు వెళ్లకుండా, చిన్న చిన్న ఆనందాలను కూడా దూరం చేసుకుని చదివాను. ఇప్పుడు నా అసలు ఫిజిక్స్ పేపర్‌ను దిద్దారో లేదో కూడా నాకు తెలియదు. విద్యార్థుల ఇలా జరగడం కరక్టేనా... అంటూ మే 23న Xలో ఒక పోస్ట్ చేశాడు.
- తప్పు ఎత్తిచూపినందుకు పాకిస్తానీ ముద్ర:
వేదాంత్ పోస్ట్ వైరల్ గా మారింది. మే 25 సాయంత్రానికల్లా ఆ పోస్ట్ 32 లక్షల వ్యూ్స్ దాటి, వెంటనే ఒక పెద్ద సోషల్ మీడియా వివాదంగా మారింది. ఆ తర్వాత కొన్ని గంటలకే వేదాంత్ ట్రోలింగ్ కు గురయ్యాడు. సీబీఎస్ఈ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ బూతులు తిట్టడం మొదలెట్టరు కొందరు. వేదాంత్ X ప్రొఫైల్ లొకేషన్ సౌత్ ఏషియా అని ఎందుకు చూపిస్తోందని ప్రశ్నించారు అంతటితో వదలకుండా దేశద్రోహి ట్రోల్ చేయడం మొదలెట్టారు. మరికొందరు పాకిస్తానీ అని ముద్ర వేస్తూ పోస్టులు పెట్టారు.
నెటిజన్లలో బాధ్యత లేని కొందరు ఇలాంటి ట్రోలింగ్ చేయడం సహజంగా జరుగుతుంది కానీ.. ఏకంగా దూరదర్శన్ న్యూస్ జర్నలిస్ట్ అశోక్ శ్రీవాస్తవ్ కూడా పాకిస్తానీ అంటూ ట్రోల్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బాధ్యతాయుతమైన జర్నలిస్టుగా ఉండి కూడా ఇలాంటి ఆరోపణలు చేయడమేంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.
- రాహుల్ గాంధీ మద్ధతు:
పాకిస్తానీగా ముద్ర వేస్తూ.. ట్రోలింగ్ కు గురవుతున్న వేదాంత్ కు లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు (LoP) రాహుల్ గాంధీతో సహా చాలా మంది మద్దతుగా నిలిచారు. మూల్యాంకనంలో జరిగిన లోపాల కారణంగా బాధపడుతున్న 17 ఏళ్ల బాలుడిపై ఇలాంటి ట్రోలింగ్ చేయడమేంటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. విద్యార్థి న్యాయం కోసం సోషల్ మీడియాను ఆశ్రయించాడు. కానీ సహాయానికి బదులుగా ట్రోలింగ్ చేయడమేంటని ప్రశ్నించారు. బీజేపీ ఐటీ సెల్ అతడిని దేశద్రోహిగా ముద్రవేసి, సోరోస్ ఏజెంట్అని, డీప్ స్టేట్లో భాగమని పిలవటం దారుణం అంటూ రాహుల్ ఎక్స్ లో పేర్కొన్నారు.
- కాక్రోచ్ పార్టీ మద్ధతు:
తీవ్ర ట్రోలింగ్ కు గురవుతున్న వేదాంత్ శ్రీవాత్సవకు కాక్రోచ్ పార్టీ మద్ధతు ఇచ్చింది. మేము వేదాంత్‌కు అండగా నిలుస్తాము. అతను చేసింది కేవలం CBSE పరీక్షలలోని అవకతవకలను బయటపెట్టడమే. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి.. అంటూ జెన్ Z నేతృత్వంలోని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పోస్ట్ చేశారు.
- వేదాంత్ కుటుంబంపై ట్రోలింగ్స్:
వేదాంత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా ట్రోలింగ్ కు గురవుతున్నారు. సీబీఎస్ఈ లోపాలను ఎత్తి చూపిన తన కుమారుడిపై పాకిస్తానీ ముద్ర వేయటమేంటని వేదాంత్ తండ్రి సంజయ్ శ్రీవాస్తవ ప్రశ్నించారు. మరోవైపు తన తమ్ముడికి మద్ధతుగా ఈ సమస్యను లేవనెత్తడానికే X అకౌంట్ సృష్టించినట్లు చెప్పాడు అతని సోదరుడు సిద్ధాంత్ చెప్పాడు. . కానీ తమను పాకిస్తానీయులుగా ముద్ర వేయటం మనోవేదనకు గురిచేసిందని ఈ సందర్భంగా చెప్పారు.
