
- రెండో విడతలో 54 సభలు
- హుస్నాబాద్‌తో మొదలు గజ్వేల్‌తో ముగింపు
హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే పలు జిల్లాలను చుట్టేసి ప్రచార సభల్లో పాల్గొన్ని సీఎం కేసీఆర్.. దీపావళి తెల్లారి నుంచి రెండో విడత ఎన్నికల ప్రచార సభలు ప్రారంభిస్తున్నారు. అక్టోబర్15న హుస్నాబాద్‌తో ప్రచారం షురూ చేసిన ఆయన శుక్రవారం వరకు 30 నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రచార సభల్లో పాల్గొన్నారు. ఆదివారం ఈ నెల 9 వరకు మరో12 సభల్లో పాల్గొంటారు. 9 వరకు నిర్వహించే ప్రచార సభల షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించగా, ఈనెల 13 నుంచి 28 వరకు కేసీఆర్ పాల్గొనే సభల షెడ్యూల్‌ను బీఆర్ఎస్ పార్టీ శనివారం రిలీజ్ చేసింది.
రెండో విడతలో 54 సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తంగా 96 ప్రచార సభల్లో ఆయన పాల్గొని పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. కేసీఆర్ మొదటి విడత ప్రచారం ఈనెల 9న కామారెడ్డిలో నిర్వహించే సభతో ముగియనుంది. ఆ తర్వాత దీపావళి కోసం మూడు రోజులు ప్రచారానికి బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 12న దీపావళి తర్వాతి రోజు నుంచి కేసీఆర్ తిరిగి ప్రచార సభల్లో పాల్గొంటారు. 13న దమ్మపేట(అశ్వరావుపేట) లో మొదలు పెట్టి 28న గజ్వేల్ సభతో ఆయన ఎన్నికల ప్రచారం ముగియనుంది.