
న్యూఢిల్లీ: పాకిస్తాన్ న్యూక్లియర్ కేంద్రాల నుంచి ఎలాంటి రేడియేషన్ గానీ, లీకేజీగానీ లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) తెలిపింది. భారత్ తో పోరులో పాక్ అణ్వాయుధ కేంద్రాల మీద దాడి జరిగిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఐఏఈఏ కొట్టివేసింది. తమకు అందిన సమాచారం ప్రకారం పాక్ న్యూక్లియర్ సెంటర్ల నుంచి ఎలాంటి లీకేజీ లేదని ఐఏఈఏ ప్రతినిధి గురువారం తెలిపారు. కాగా.. పాక్ అణు స్థావరమైన కిరానా హిల్స్ పై ఇండియా దాడి చేసిందన్న వార్తలను భారత వాయుసేన ఎయిర్ మార్షల్ ఏకే భారతి కూడా ఇదివరకే తిరస్కరించారు.