దీపావళి పండగ ఉత్సాహం ముగిసింది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి లేదు. విక్రమ్ తనయుడు హీరోగా వస్తున్న 'బైసన్' మినహా, ప్రేక్షకుల్లో పెద్దగా బజ్ ఉన్న సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు. కానీ సినీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ మాత్రం తగ్గడం లేదు. ఈ వీకెండ్‌లో ఆడియన్స్ చూపు పూర్తిగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వైపే మళ్లింది. థియేటర్ల కొరతను తీర్చడానికి, అక్టోబర్ 24వ తేదీ శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌ల పండగ మొదలు కానుంది. ఒక్కరోజే 17 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిల్లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన 'పరమ్ సుందరి' నుంచి విజయ్ ఆంటోనీ 'భద్రకాళి' వరకు.. విభిన్న భాషలు, జానర్‌లకు చెందిన కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కొత్త కంటెంట్ వివరాలు చూద్దాం..
అమెజాన్ ప్రైమ్‌లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన 'పరమ్ సుందరి' (Parama Sundari) ఈ వారం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. అలాగే, హాలీవుడ్ సినిమాలు 'ఈడెన్' (Eden), 'బోన్ లేక్' (Bone Lake) కూడా అక్టోబర్ 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి.
నెట్‌ఫ్లిక్స్‌లో ఆడియన్స్ కోసం 'కురుక్షేత్ర - 2' (యానిమేటెడ్ సిరీస్), మిస్టరీ సిరీస్ 'పరిష్' (Parish), 'ఎ హౌస్ ఆఫ్ డైనమైట్' అక్టోబర్ 24 నుంచి కాగా కొరియన్ సిరీస్ 'ది డ్రీమ్ లైఫ్ ఆఫ్ మిస్టర్ కిమ్' అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే అక్టోబర్ 23 నుంచి పవన్ కళ్యాణ్ ' ఓజీ ' స్ట్రీమింగ్ అవుతోంది.
హాట్‌స్టార్ లో విజయ్ ఆంటోనీ నటించిన తమిళ చిత్రం 'భద్రకాళి' (Bhadrakali) , 'మహాభారత్: ఏక్ ధర్మయుధ్' వెబ్ సిరీస్‌తో అలరించనుంది. 'ది కర్దాషియన్స్' సీజన్ 7 కూడా రానుంది. ఇవన్నీ 24 తేదీ నుంచే స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆహా: తమిళ చిత్రం 'అక్యూజ్డ్' (Accused) అక్టోబర్ 24 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
లయన్స్ గేట్ ప్లేలో హాలీవుడ్ మూవీస్ 'ది అప్రెంటిస్' (The Apprentice), 'ఫ్రీ లాన్స్' (Freelance) తో పాటు మలయాళ సినిమా 'నడికర్' (Nadikkar) అందుబాటులో ఉండనున్నాయి.
►ALSO READ | సంతాన ప్రాప్తిరస్తు.. యూత్‌ఫుల్ కంటెంట్‌తో చాందినీ చౌదరి
సన్ నెక్ట్స్: తమిళ సినిమా 'టేల్స్ ఆఫ్ ట్రేడిషన్', కన్నడ చిత్రం 'జంబూ సర్కస్'లను చూడవచ్చు.
హెచ్‌బీఓ మ్యాక్స్ / యాపిల్ టీవీ ప్లస్ లలోఈ అంతర్జాతీయ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 'వెపన్స్' (Weapons), 'స్టిల్లర్ అంజ్ మియారా నథింగ్ ఈజ్ లాస్' వంటి హాలీవుడ్ కంటెంట్ అక్టోబర్ 24 నుంచి అందుబాటులోకి రానుంది.
ఈ వారం థియేటర్లను డామినేట్ చేసే పెద్ద సినిమాలు లేకపోవడం వల్ల, ఓటీటీ కంటెంట్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే సినీ ప్రేమికులకు ఇది మంచి అవకాశం. బెడ్, పాప్‌కార్న్ సిద్ధం చేసుకుని, మీకు నచ్చిన ప్లాట్‌ఫామ్‌లో ఈ వీకెండ్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
