సంతాన ప్రాప్తిరస్తు.. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చాందినీ చౌదరి

సంతాన ప్రాప్తిరస్తు.. యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో చాందినీ చౌదరి

కలర్ ఫొటో, గామి లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న చాందినీ చౌదరి.. ఇప్పుడు ‘సంతాన ప్రాప్తిరస్తు’ అనే యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. గురువారం (అక్టోబర్ 23) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు.


 పెళ్లి కూతురి గెటప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె కనిపిస్తున్న ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆకట్టుకుంటోంది.  ఇందులో కళ్యాణి ఓరుగంటి అనే పాత్రను చాందినీ పోషిస్తోంది. విక్రాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా నటిస్తున్న  ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, హర్షవర్థన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  నవంబర్ 14న సినిమా విడుదల కానుంది.