
ప్రపంచంలోనే అతిపెద్ద,అత్యంత శక్తివంతమైన రాకెట్ స్టార్‌షిప్ ఫ్లైట్(IFT11) కీలక టెస్ట్ సక్సెస్ అయింది. అక్టోబర్ 13, 2025న టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు. ఇది స్పేస్ ఎక్స్ ఫ్లైట్11వ టెస్టు. అన్ని ప్రధాన లక్ష్యాలను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. స్టార్‌షిప్ 11వ ఫ్టైల్టెస్ట్.. స్పేస్‌ఎక్స్ కు చెందిన అతిపెద్ద, తిరిగి ఉపయోగించగల రాకెట్‌కు సంబంధించినది.
Space X స్టార్‌షిప్ రాకెట్ టెక్సాస్ స్టార్ బేస్ నుంచి ప్రయోగించారు. బూస్టర్ విడిపోయి నిర్దేశించిన నియంత్రిత పద్ధతిలో అంతరిక్షంలో ప్రయాణించి మెక్సికో గల్ఫ్‌లోని అంతరిక్ష నౌక హిందూ మహాసముద్రంలో దిగింది ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా సక్సెస్ఫుల్ గా టెస్ట్ ను పూర్తి చేసుకుంది. గతంలో మాదిరిగానే..స్టార్‌షిప్ 8మాక్ స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది.మెక్సికన్ సరిహద్దుకు సమీపంలోని స్టార్‌బేస్ నుంచి ప్రారంభించబడిన ఈ మిషన్ 60 నిమిషాలకు పైగా కొనసాగింది.
ఇది పూర్తి స్థాయి స్టార్‌షిప్ టెస్ట్ ఫ్లైట్‌గా గుర్తించారు. దీనిని SpaceX వ్యవస్థాపకుడు ,CEO ఎలోన్ మస్క్.. మార్స్(అంగారకుడు) పైకి మనుషులను పంపే పనిలో ఉన్నారు. 2030 నాటికి చంద్రునిపై వ్యోమగాముల ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న నాసాకు కూడా స్టార్‌షిప్ ఫ్లైట్ చాలా కీలకం.
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రయోగాలు..పూర్తి సమీక్ష
స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్ ప్రోగ్రాం మానవులను మార్స్‌కు తీసుకెళ్లేందుకు రూపొందించిన పూర్తి తిరిగి ఉపయోగించగల రాకెట్ సిస్టమ్. ఇది సూపర్ హెవీ బూస్టర్ ,స్టార్‌షిప్ అప్పర్ స్టేజ్‌తో ఉంటుంది. మొత్తం ఇప్పటవరకు 11 ప్రయోగాలు చేశారు. మొదటి ప్రోటోటైప్ టెస్టులు 2019లో ప్రారంభమయ్యాయి. కానీ ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్టులు (IFTలు) 2023 ఏప్రిల్ నుంచి ఆర్బిటల్ ప్రయత్నాలుగా జరిగాయి. నిన్నవరకు (అక్టోబర్ 14, 2025) నాటికి మొత్తం 11 IFTలు పూర్తయ్యాయి. వీటిలో చివరిది IFT-11 విజయవంతమైంది.
Starship's eleventh flight test reached every objective, providing valuable data as we prepare the next generation of Starship and Super Heavy → https://t.co/YmvmGZTV8o pic.twitter.com/gO0i8XFWIH
— SpaceX (@SpaceX) October 14, 2025
స్టార్‌షిప్ ప్రయోగాలు టెక్సాస్‌లోని స్టార్‌బేస్ నుంచి నిర్వహిస్తున్నారు. వీటి ప్రధాన లక్ష్యాలు రాప్టర్ ఇంజన్లు, హీట్ షీల్డ్, రీ-ఎంట్రీ, బూస్టర్ క్యాచ్ (మెక్ టవర్‌తో), సాటిలైట్ డెప్లాయ్‌మెంట్. ఇవి NASA ఆర్టెమిస్, స్టార్‌లింక్, మార్స్ మిషన్‌లకు కీలకం.
సక్సెస్ రేటు..
మొదటి 4లో టెస్టులు పేలుళ్లు సంభించాయి. అయితే IFT-5 నుంచి రీయూజబిలిటీ (క్యాచ్ & రీఫ్లై) సాధించారు. 2025లో 7 ప్రయోగాలు చేశారు.