‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ కొత్త సినిమా ‘అనుమాన పక్షి’

‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ కొత్త సినిమా ‘అనుమాన పక్షి’

రాగ్ మయూర్ హీరోగా ‘డిజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ  తెరకెక్కిస్తున్న చిత్రం ‘అనుమాన పక్షి’.  చిలకా ప్రొడక్షన్స్ పై రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో  బ్రహ్మాజీ, అజయ్‌‌, సీనియర్‌‌ నటి రాశి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

తాజాగా స్పెషల్ వీడియోతో  రాగ్ మయూర్ పాత్రను పరిచయం చేశారు.  ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యాడు.  అతిగా ఆలోచించడం, అతి జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే విచిత్రమైన క్యారెక్టర్‌‌‌‌లో కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచింది. అలాగే ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ తెలియ జేశారు.