
రవితేజ నుంచి రాబోతున్న చిత్రం ‘మాస్ జాతర’ శ్రీలీల హీరోయిన్. భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రాగా, బుధవారం (అక్టోబర్ 22) నాలుగో పాటను విడుదల చేశారు. ‘సూపర్ డూపర్’ అంటూ సాగే ఈ హుషారైన పాటను భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతో పాటు రోహిణి సోరట్‌తో కలిసి ఎనర్జిటిక్‌గా పాడారు.
‘‘ఈ పాటకు రిధమ్ లేదు, పదమ్ లేదు, అర్థం లేదు, పర్థం లేదు.. ఈ పాటకు ట్యూనింగ్ లేదు, ప్లానింగ్ లేదు.. పల్లవి లేదు, చరణం లేదు..’’ అంటూ సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాశారు. వింటేజ్ రవితేజను గుర్తు చేసేలా, తన మార్క్ స్వాగ్‌తో పాటను చిత్రీకరించారు. తన మార్క్ మాస్ స్టెప్పులతో రవితేజ, ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లో శ్రీలీల ఆకట్టుకున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలో ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. అక్టోబర్ 31న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.