
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున పాఠశాల విద్యాశాఖ అధికారులు స్కూల్ టైమింగ్స్ మార్చారు. గురువారం నుంచి ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే బడులు కొనసాగించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. ఈ నెల ఏప్రిల్ 6 దాకా ఇదే టైమ్ కొనసాగించాలని సూచించారు. స్కూల్ టైమింగ్లోనే స్టూడెంట్లకు మధ్యాహ్న భోజనం అందించాలని చెప్పారు. టెన్త్ స్టూడెంట్లకు స్టడీ అవర్స్ నిలిపివేయాలని ఇంటర్నల్ ఆదేశాలిచ్చారు.