
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఇటీవల ఆహార ఉత్పత్తుల లేబుళ్లపై "100%" క్లెయిమ్‌లను ఉపయోగించడాన్ని నిషేధించింది. ఈ చర్య తప్పుడు క్లెయిమ్‌లు ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టమర్లను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని FSSAI అభిప్రాయపడింది.2025 ప్రారంభంలో FSSAI కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.తప్పుడు ప్రకటనల నియంత్రణ, కస్టమర్ల నమ్మకాన్ని కాపాడటం, ఆహార పరిశ్రమలో పారదర్శకతను మెరుగు పర్చే లక్ష్యంగా 100శాతం క్లెయిమ్ లను నిషేధించింది FSSAI.
ALSO READ | Rainy season: ఈ పండ్లు తిన్నారంటే.. దవాఖానాకు పరిగెత్తాల్సిందే..
ఏదైనా షాపునుంచి గానీ, మాల్స్ నుంచి గానీ ఆహార పదార్థాలను కొనుగోలు చేస్తున్నప్పుడు ‘‘100% Natural", "100% Pure", "100% Safe" వంటి పదాలను లేబుళ్లపై చూస్తుంటాం. ఇటువంటి డిస్ ప్లేలను FSSAI నిషేధించింది. ఈ రకమైన క్లెయిమ్‌లు ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తూ కస్టమర్లకు నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నారని నిషేధం విధించింది.
FSSAI తెలిపిన ప్రకారం..ఈ తరహా క్లెయిమ్‌లు తప్పుదారి పట్టిస్తున్నాయి. మార్కెటింగ్ కు చెల్లుబాటు కావు. కొత్త మార్గదర్శకాలు అనుసరించి ఫుడ్ బిజినెస్ క్లెయిమ్‌లు చేసేటప్పుడు వాటికి సైంటిఫిక్ ఆధారాలు ఇవ్వాలి. ఈ చర్య కస్టమర్లను వాస్తవ సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకునేలా చేయడమే FSSAI లక్ష్యం.