
ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆదివారం (జూలై 27) జరిగిన నాలుగో టెస్టు చివరి రోజు హై డ్రామా చోటు చేసుకుంది. మాంచెస్టర్ వేదికగా ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆట ఐదో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ టీమిండియా ఆల్ రౌండర్ జడేజాపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు గురి చేస్తోంది. ఐదో రోజు చివరి సెషన్ లో గంట మాత్రమే అట మిగిలి ఉంది. మరో 15 ఓవర్ల ఆట ఇంకా మిగిలే ఉంది. ఈ సమయంలో స్టోక్స్ మ్యాచ్ డ్రా కోసం షేక్ హ్యాండ్ కోరుతూ జడేజా దగ్గరుకు వెళ్ళాడు. అయితే జడేజా అప్పుడు 89 పరుగులు వద్ద ఉంటే.. సుందర్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఇద్దరూ కూడా సెంచరీలు దగ్గరలో ఉండడంతో జడేజా, సుందర్ స్టోక్స్ కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో జడేజాపై ఇంగ్లాండ్ కెప్టెన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. జడేజా దగ్గరకు వెళ్లి నువ్వు బ్రూక్ బౌలింగ్ లో సెంచరీ కొట్టాలనుకుంటున్నావా అని జడేజాను తక్కువ చేసి మాట్లాడడు. దీనికి జడేజా రిప్లై అదిరిపోయింది. " మీ ఫీల్డింగ్ ప్లాన్స్ నేను రాయలేదు. నేను కేవలం నా జట్టు కోసం చేయాల్సిందంతా చేస్తున్నాను". అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు స్టంప్ మైక్ లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత స్టోక్స్ తో పాటు మిగిలిన ఇంగ్లాండ్స్ ప్లేయర్లు జడేజా దగ్గరకు వచ్చి డ్రా ఇవ్వాల్సిందిగా బతిమిలాడారు.
ఇండియా డ్రాకు నిరాకరించడంతో జడేజా, సుందర్ తమ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. చివర్లో హ్యారీ బ్రూక్, రూట్ బౌలింగ్ చేయడంతో త్వరగానే జడేజా, సుందర్ సెంచరీ మార్క్ అందుకున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 358 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 669 పరుగుల భారీ స్కోర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రా కావడంతో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. చివరి టెస్ట్ జూలై 31 న ఓవల్ లో జరుగుతుంది.
Scored a hundred, saved the Test, farmed ♾ aura! 💁♂#RavindraJadeja didn't hesitate, till the end 👀#ENGvIND 👉 5th TEST | Starts THU, 31st July, 2:30 PM | Streaming on JioHotstar! pic.twitter.com/cc3INlS07P
— Star Sports (@StarSportsIndia) July 27, 2025