స్టాక్​ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో ఇంజనీర్లకు ఫుల్​ డిమాండ్

స్టాక్​ బ్రోకరేజ్ ఇండస్ట్రీలో ఇంజనీర్లకు ఫుల్​ డిమాండ్

బిజినెస్‌‌‌‌ డెస్క్, వెలుగు: ఒకప్పుడు బ్రోకరేజ్ ఇండస్ట్రీ అంటే రీసెర్చ్, సేల్స్ టీమే ఎక్కువుగా ఉండేది. ఎక్కడ చూసినా వారే కనిపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బ్రోకరేజ్ ఇండస్ట్రీలో ఇంజనీర్లకు మస్తు డిమాండ్ ఉంటోంది. ఇంజనీర్లు అకస్మాత్తుగా బ్రోకరేజ్ సంస్థల్లో అతిపెద్ద వర్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌గా మారిపోయారు. కొత్త ఏజ్ ప్రొడక్ట్‌‌‌‌లను డెవలప్ చేయడంలో వీరు కీలకంగా ఉంటున్నారు. దలాల్ స్ట్రీట్లో ఒకప్పుడు ఎన్నో ఏళ్లు ఎక్స్‌‌‌‌పీరియెన్స్ ఉన్న వారు ట్రేడింగ్‌‌‌‌ చేసేవారు. కానీ ఇప్పుడు మిలీనియల్స్ మస్తు ట్రేడింగ్ చేస్తున్నారు. సాఫ్ట్‌‌‌‌వేర్లు, ఇతర ఉద్యోగాలు చేసేవాళ్లు కూడా దలాల్ స్ట్రీట్‌‌‌‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఫోన్‌‌‌‌ల ద్వారానే ట్రేడింగ్ మెళుకవలు తెలుసుకుంటూ.. న్యూ ఏజ్ ప్రొడక్ట్‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ‘యంగ్ పాపులేషన్‌‌‌‌ను ట్యాప్ చేయాలంటే.. ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌ను తేలికగా వాడుకునేలా అవకాశం కల్పించాలి. అంతేకాక డిజైన్‌‌‌‌పై ఫోకస్ చేయాలి. ట్రెడిషనల్ బ్రోకరేజ్ షాపులు లేదా బ్యాంక్‌‌‌‌ల మాదిరిగా కాకుండా మా ఉద్యోగుల్లో ఎక్కువ భాగం ఇంజనీర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు లేదా డిజైనర్లే ఉన్నారు. ప్రతి సొల్యుషన్ కూడా ఇంజనీరింగ్ టీమ్‌‌‌‌తోనే ప్రారంభమవుతుంది’ అని అప్‌‌‌‌స్టాక్స్ సీఈవో, కోఫౌండర్ రవి కుమార్ తెలిపారు. జెరోధా తర్వాత దేశంలో రెండో అతిపెద్ద బ్రోకరేజ్ సంస్థగా అప్‌‌‌‌స్టాక్స్ ఉంది.

బ్రోకరేజ్ ఇండస్ట్రీ అంతా ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత డిస్కౌంట్ బ్రోకర్లతోనే నడుస్తోంది. కొత్త ఏజ్ ఇన్వెస్టర్లకు సరిపడే ప్రొడక్ట్‌‌‌‌లపై డిస్కౌంట్ బ్రోకర్లు ఫోకస్ చేస్తున్నారు. అంతేకాక ఈ డిస్కౌంట్ బ్రోకర్లు లాక్‌‌‌‌డౌన్ కాలంలో కొత్తగా చాలా మంది కస్టమర్లను తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లపైకి చేర్చుకున్నారు. వీరిని చూసి ప్రస్తుతం ట్రెడిషినల్ బ్రోకర్లు కూడా డిజిటల్ ప్రొడక్ట్‌‌‌‌లను అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెంచారు.  ‘ఇప్పుడిప్పుడే ట్రెడిషనల్ బ్రోకర్లు డిజిటైజేషన్‌‌‌‌ వైపుకి వెళ్తున్నారు. చాలా మంది ట్రెడిషనల్ బ్రోకర్ల వద్ద సేల్స్, రీసెర్చ్ టీమ్‌‌‌‌లు బాగానే ఉన్నాయి. ప్రస్తుతం డిజిటల్ కెపాబులిటీలను ఈ బ్రోకర్లు పెంచుతున్నారు’ అని ఏంజెల్ బ్రోకింగ్ సీఈవో వినయ్ అగర్వాల్ అన్నారు. బ్రోకింగ్ ఇండస్ట్రీలో ఇంజనీర్లు, యాప్ డిజైనర్ల నియామకం పెరిగిందని పేర్కొన్నారు.

ప్రతి నలుగురికి ఒక ఇంజనీర్​

యాక్సిస్‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌లో రీసెర్చ్ టీమ్‌‌‌‌ను మినహాయిస్తే.. ప్రతి నలుగురు లేదా ఐదు మంది ఆన్‌‌‌‌గ్రౌండ్ సేల్స్ వ్యక్తులకు ఒక ప్రొడక్ట్ ఇంజనీర్‌‌‌‌‌‌‌‌ను, ఒక డిజిటల్ సేల్స్ పర్సన్‌‌‌‌ను సెంట్రల్ ఆఫీసులో ఉంచుతున్నామని తెలిపారు. ప్రొడక్ట్, ఇంజనీర్, డిజిటల్ సేల్స్ టీమ్స్‌‌‌‌ను ఒక యూనిట్‌‌‌‌గా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. యాక్సిస్ సెక్యూరిటీస్ డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనే కొత్త మొబైల్ యాప్‌‌‌‌ను, వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను లాంచ్ చేసినట్టు తెలిపారు. దీనిలో మార్కెట్ అనలిటిక్స్, పోర్ట్‌‌‌‌ఫోలియో అనలిటిక్స్, అడ్వయిజరీ ప్రొడక్ట్స్, ఛాట్‌‌‌‌బోట్స్‌‌‌‌ ఉన్నట్టు చెప్పారు. ‘యాక్సిస్ ట్రేడ్ ప్రొ’ పేరుతో కొత్త డెస్క్‌‌‌‌టాప్ ట్రేడింగ్‌‌‌‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు.  ప్రొడక్ట్, టెక్ రెండు సపోర్ట్ ఫంక్షన్స్ కావని, ఇవి తమ వ్యాపారాలకు కీలకమైనవని 5పైసా డాట్ కామ్ సీఈవో ప్రకాశ్ గాగ్డాని చెప్పారు.