కేజీబీవీ సీట్లకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌

కేజీబీవీ సీట్లకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌
  • గతేడాది కంటే పెరిగిన అడ్మిషన్స్‌‌‌‌

కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో సీట్లకు డిమాండ్‌‌‌‌ పెరిగింది. ఈ ఏడాది అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోయాయి.గతేడాది కంటే ఈసారి హైస్కూల్‌‌‌‌ స్థాయిలో 11,349 అడ్మిషన్స్‌‌‌‌ పెరగ్గా, ఇంటర్‌‌‌‌తో కలిపి 22,799 మంది కొత్తగా చేరారు. 2018-19లో 475 స్కూల్స్‌‌‌‌ పరిధిలో ఆరో తరగతి నుంచి ఇంటర్‌‌‌‌ ఫస్టియర్‌‌‌‌ వరకూ 91,600 సీట్లు అందుబాటులో ఉండగా 88,409 నిండాయి. గత ఏడాది 88 స్కూళ్లలో ఇంటర్‌‌‌‌ క్లాసులు ప్రారంభించగా 5,152 మంది స్టూడెంట్స్‌‌‌‌ చేరారు. 2019-20లో 1,12,440 సీట్లుండగా ఇప్పటివరకు 1,11,208 అడ్మిషన్స్‌‌‌‌ అయ్యాయి. ఇందులో 94,606 మంది హైస్కూల్‌‌‌‌ స్థాయి స్టూడెంట్స్‌‌‌‌ కాగా, 16,602 మంది కాలేజీ విద్యార్థులు. ఈ ఏడాది కొత్తగా 84 కేజీబీవీల్లో ఇంటర్‌‌‌‌ ఫస్టియర్‌‌‌‌ క్లాసులు ప్రారంభించారు. కేజీబీవీల్లో స్టూడెంట్స్‌‌‌‌కు క్వాలిటీ ఎడ్యుకేషన్‌‌‌‌, మంచి ఫుడ్‌‌‌‌ అందిస్తున్నట్టు ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ స్టేట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ విజయ్‌‌‌‌కుమార్‌‌‌‌ తెలిపారు.