సెకండ్ హ్యాండ్ బండ్లకు మస్తు గిరాకీ

సెకండ్ హ్యాండ్ బండ్లకు మస్తు గిరాకీ

హైదరాబాద్‌‌, వెలుగు:రాష్ట్రంలో సెకండ్ హ్యాండ్ బండ్లకు మస్తు గిరాకీ పెరిగింది. లాక్‌‌ డౌన్‌‌ తర్వాత వీటి అమ్మకాలు జోరందుకున్నాయి. కరోనా భయంతో జనం ఎక్కువగా సొంత వెహికల్స్​పై వెళ్లడానికే ఇష్టపడుతున్నారు. దీంతో సొంత వెహికల్స్​ లేనివాళ్లు, కొత్త బండ్లు కొనేందుకు స్తోమత లేనివాళ్లు.. సెకండ్​ హ్యాండ్​ వెహికల్స్​పై ఫోకస్​ పెడుతున్నారు. పైగా ఆ బండ్లు తక్కువ ధరకు రావడం, మంచి ఫీచర్స్  ఉండటం కలిసివస్తోంది. సెకండ్​ హ్యాండ్​ వెహికల్స్​కు బ్యాంకులు, ఫైనాన్స్​ సంస్థలు కూడా లోన్లు ఇస్తున్నాయి. కార్లతోపాటు టూ వీలర్స్​ కూడా మంచి గిరాకీ ఉంది. ఆర్టీఏకూ ఆదాయం వస్తోంది.

ఓన్‌‌ వెహికల్స్‌‌కే ప్రయారిటీ

కరోనా ఎఫెక్ట్​ కారణంగా పబ్లిక్‌‌ ట్రాన్స్‌‌పోర్ట్‌‌ తక్కువగా నడుస్తోంది. హైదరాబాద్‌‌లో ఆర్టీసీ, మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వలేదు. జిల్లాల్లో బస్సులు నడుస్తున్నా కరోనా భయంతో ప్రయాణికులు పెద్దగా ఎక్కడం లేదు.  ఆటోలు, క్యాబ్‌‌ల్లో వెళ్లాలంటే జంకుతున్నారు. దీంతో సొంతంగా బండ్లలో వెళ్లేందుకే చాలా మంది ఇష్టపడుతున్నారని, ఫలితంగా సెకండ్‌‌ హ్యాండ్‌‌  బండ్లకు గిరాకీ పెరిగిందని ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. కార్ల విషయానికొస్తే మారుతీ స్విఫ్ట్‌‌, హ్యుండాయ్ శాంట్రో జింగ్‌‌, హ్యుండాయ్‌‌ గ్రాండ్‌‌ ఐ 10, హోండా సిటీ, మారుతీ స్విఫ్ట్‌‌ డిజైర్‌‌‌‌ వంటి ఐదు మోడళ్లకు కస్టమర్ల నుంచి డిమాండ్‌‌ ఎక్కువగా ఉందని కార్స్ 24 సంస్థ పేర్కొంది. సెకండ్‌‌ హ్యాండ్‌‌ కార్లకు డిమాండ్‌‌ పెరుగుతోందని అభిప్రాయపడింది. వెబ్‌‌సైట్‌‌లో బయ్యర్‌‌‌‌ వైపు నుంచి నెలకు 20 లక్షల నుంచి 25 లక్షల విజిట్స్‌‌ వస్తున్నాయని వెల్లడించింది.

లోన్లూ ఇస్తున్నరు

సెకండ్ హ్యాండ్ వెహికల్స్​ మార్కెట్  బాగుండటంతో బ్యాంకింగ్, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు లోన్లు ఇస్తున్నాయి. కార్లకు ఎక్కువగా రుణాలు ఇస్తున్నాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సెకండ్​ హ్యాండ్​ వెహికల్​కు సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లు ఉన్నాయోలో లేదో ముందే చూసుకోవాలి. వాటిలో ఉన్న వివరాల ప్రకారం ఇంజన్, చాజిస్ నంబర్ చెక్‌‌ చేయాలి. మెకానిక్‌‌ను తీసుకెళ్లి బండి కండిషన్‌‌ టెస్ట్‌‌ చేయించుకోవాలి. కొనగానే వెంటనే తమ పేరు మీదికి మార్చుకోవాలి. వాటిపై ఏమైనా కేసులు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఆన్‌‌లైన్‌‌లో కొనేటప్పుడు అలర్ట్​గా ఉండాలి.

మంచి ఫీచర్లు, తక్కువ రేట్లు

ఎక్కువ మంది వాహనదారులు ఆన్‌లైన్‌లో బండ్లను కొంటున్నారు. కస్టమర్లు అన్ని వెబ్‌ సైట్లలో వెతికి, బండి చూసి నచ్చాకే డిసైడ్‌ అవుతున్నారు. ఇటీవల కాలంలో ఓఎల్‌ఎక్స్‌, క్విక్కర్‌, డ్రూమ్‌, కార్‌ ధేకో, కార్‌ 24, కార్‌వాలే వెబ్‌సైట్లలో ఎక్కువగా యూజ్డ్‌ వెహికిల్స్‌ అమ్ముడుపోతున్నాయి. ఇక డీలర్లు, ఏజెంట్లు, తెలిసిన వ్యక్తుల వద్ద కూడా సెకండ్‌ హ్యాండ్‌ బండ్లను కొనుగోలు చేస్తున్నారు. హైదరాబాద్‌తోపాటు వరంగల్‌, కరీంనగర్‌లాంటి సిటీల్లో సెకండ్ హ్యాండ్​ బండ్ల సేల్ ఏజన్సీలు బాగా పెరిగాయి. ఫైనాన్షియర్లు కూడా కిస్తీలు కట్టలేని వాళ్ల నుంచి తెచ్చిన బండ్లను అమ్మేస్తున్నారు. కరోనాతో గిరాకీ లేక ప్రైవేట్​ క్యాబ్‌ డ్రైవర్లు తక్కువ ధరలకే కార్లను అమ్ముతున్నారు.

ఐదేళ్లలో చెరువు విస్తీర్ణం ఎలా తగ్గింది.?