వీసీ పోస్టులకు ఫుల్ డిమాండ్

వీసీ పోస్టులకు ఫుల్ డిమాండ్
  •  మొత్తం 1382 అప్లికేషన్లు 
  • అంబేద్కర్ వర్సిటీకీ అత్యధికం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పది సర్కారు యూనివర్సిటీల్లోని వీసీ పోస్టులకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. ఏకంగా1,382 దరఖాస్తులు అందాయి. అప్లై చేసినవారిలో  312 మంది ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. త్వరలోనే స్ర్కూట్నీ ప్రక్రియ మొదలుకానున్నది. స్టేట్​లో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, తెలుగు యూనివర్సిటీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, జేఎన్ఏఎఫ్​ఏయూ, మహాత్మాగాంధీ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జేఎన్టీయూహెచ్ తదితర వర్సిటీల్లో వీసీ పోస్టులకు జనవరి 28 నుంచి ఈ నెల 12 వరకూ అప్లికేషన్ ప్రక్రియ కొనసాగింది. సోమవారంతో దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. అత్యధికంగా బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 208 అప్లికేషన్లు వచ్చాయి. అత్యల్పంగా జేఎన్ఏఎఫ్ఏయూకు 51 వచ్చాయి. 

వీసీ సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ స్టార్ట్

 అప్లికేషన్ల ప్రక్రియ ముగియడంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ టీమ్ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కానున్నది. మరోపక్క ఇప్పటికే వీసీ సెర్చ్ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. యూనివర్సిటీ ఈసీ సమావేశాలు నిర్వహించి, వర్సిటీ నామినీల నియామకం పూర్తిచేశారు. యూజీసీ నామినీల కోసం విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఇప్పటికే లేఖ రాశారు. ఆ పేర్లు రాగానే, సర్కారు నామినీలతో కలిపి ఒక్కో వర్సిటీకి ముగ్గురు సభ్యులతో కూడిన సెర్చ్ కమిటీలను నియమించనున్నారు. సాధ్యమైనంత త్వరగా వీసీల రిక్రూట్మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది.