IPL 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాధారణ పొందిన క్రికెట్ లీగ్ లో ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్). ఈ లీగ్ లో ఆడే ప్రతి ఫ్రాంచైజీకి ప్రత్యేకమైన యజమాన్య నిర్మాణం ఉంటుంది. ఈ ఐపీఎల్ లోని 10 జట్ల వెనుక భారీ వ్యాపార సామ్రాజ్యాధినేతలు, సినీ ప్రముఖులు, కార్పొరేట్ దిగ్గజాలు ఉన్నారు. తాజాగా ఈ మెగా క్యాచ్ రిష్ లీగ్ లో భారీ క్రేజ్ సంపాదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు అమ్ముడుపోయాయి.
ఆర్సీబీ, ఆర్ఆర్ అమ్మకం:
కాగా ఆర్సీబీని రూ.16,706 కోట్ల ధరకు ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్, బోల్డ్ వెంచర్స్, బ్లాక్‌స్టోన్ సంస్థలు దక్కించుకోగా.. రూ.15, 280 కోట్లకు రాజస్థాన్ జట్టుని ప్రముఖ టెక్ వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్షియం చేజిక్కించుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ టీమ్స్ అమ్మకాలతో ఐపీఎల్ లోని 10 జట్ల ఓనర్స్ ఎవరని క్రికెట్ ఫ్యాన్స్ నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు.
ఐపీఎల్ లోని 10 జట్ల ఓనర్లు:
* ముంబై ఇండియన్స్– నీతా అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్
* చెన్నై సూపర్ కింగ్స్– ఎన్ శ్రీనివాసన్ ఆధ్వర్యంలోని ఇండియా సిమెంట్స్
* రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు– ఆదిత్య బిర్లా గ్రూప్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్స్
* సన్‌రైజర్స్ హైదరాబాద్– కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సన్ టీవీ నెట్ వర్క్
* కోల్‌కతా నైట్‌రైడర్స్– బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, జూహీ చావ్లా, రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ యజమాన్యం
* రాజస్థాన్ రాయల్స్– ప్రస్తుతం కల్ సోమని నేతృత్వంలోని యాజమాన్యం
* పంజాబ్ కింగ్స్– బాలీవుడ్ నటి ప్రీతి జింటా, నెస్ వాడియా, మొహిత్ బర్మన్, కరణ్ పాల్
* ఢిల్లీ క్యాపిటల్స్– పార్థ్ జిందాల్ ఆధ్వర్యంలోని జేఎస్ డబ్ల్యూ గ్రూప్ జట్టు నిర్వహణలో కీలక పాత్ర
* లక్నో సూపర్ జెయింట్స్– సంజీవ్ గోయెంకా నేతృత్వంలోని ఆర్పీఎస్ఓ గ్రూప్స్
* గుజరాత్ టైటాన్స్– సిద్ధార్థ్ పటేల్ కు చెందిన సీవిసీ క్యాపిటల్ పార్టనర్స్
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) జట్ల వెనుక ఉన్న యజమానులు చూస్తే.. కార్పొరేట్ ప్రపంచం, సినీ రంగం, అంతర్జాతీయ పెట్టుబడిదారులు కలిసి ఈ లీగ్ ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లినట్లుగా క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ బలమైన యాజమాన్యాల వల్లే ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందడంతో పాటు అత్యంత ధనిక వంతమైన లీగ్ గా గుర్తింపు పొందింది.
