యూపీలో నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్

యూపీలో నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్

కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా ఉత్తర ప్రదేశ్‌లో నాలుగు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.  ఈ లాక్‌డౌన్ ఏప్రిల్ 30 శుక్రవారం సాయంత్రం నుంచి మే 4 మంగళవారం ఉదయం 7 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే యూపీలో వీకెండ్ లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలులో ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా వల్ల బుధవారం 266 మంది చనిపోయారు. దాంతో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 11,943గా నమోదైంది. కొత్తగా 29,824 కేసులు నమోదవడంతో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 11,82,848కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 3,00,041 యాక్టివ్ కేసులున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

కాగా.. ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉంటే రిటైర్డ్ వైద్యులు మరియు పారా మెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవచ్చని సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు.