వీరవెల్లిలో కుంటలు, చెరువుకు గంగపూజ

వీరవెల్లిలో కుంటలు, చెరువుకు గంగపూజ

యాదాద్రి భువనగిరి : మండలంలోని వీరవెల్లి గ్రామంలో శనివారం కురిసిన వానకు కుంటలు, చెరువు పొంగి పొర్లాయి. గత 5 సంవత్సరాల తర్వాత గ్రామంలో ఉన్న ఎర్రకుంట, మర్రికుంట, కాటమయ్యకుంట, ఊరి పెద్ద చెరువు నిండి అలుగు పోశాయి. ఈ సందర్భంగా గ్రామస్థులు ఆదివారం ఉదయం గంగమ్మ తల్లికి పూజలు చేసి, సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ కంచి మల్లయ్య,  సర్పంచ్ తంగళ్ళపల్లి కల్పన శ్రీనివాస చారి, MPTC కంచి లలిత మల్లయ్య, ఉప సర్పంచ్ కరిమలమ్మ జార్జి, పాల సంఘం చైర్మైన్ బీమరి మచ్చెందర్, TRS గ్రామశాఖ అధ్యక్షుడు తోటకూరి పరమేష్, మాజీ సర్పంచ్ రేగు వెంకటేష్, రేగు అంజయ్య, సోకం సాయిలు, సోకం కృష్ణమూర్తి, సురుగు నర్సింహ, పాలెం రవి, గడ్డమీది అర్జున్, నల్లమాసు రాజు, సర్దార్ రాము, చందుపట్ల మల్లేష్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

మెట్ట ప్రాంతప్రజలకు శుభవార్త- మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్

భువనగిరి మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు పలు గ్రామాల్లో కుంటలు, చెరువులు నిండటం సంతోషకరమన్నారు మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డి నేటర్ కంచి మల్లయ్య. ఆదివారం వీరవెల్లిలో మాట్లాడిన ఆయన..మెట్ట ప్రాంత ప్రజలకు ఇది శుభవార్త అన్నారు. వీరవెల్లిలో కాలం సరిగ్గా లేక రైతులు చాలా ఇబ్బంది పడ్డారని.. శనివారం కురిసిన జోరువానతో కుంటలు, చెరువు నిండిందన్నారు.

రైతులు ఆనందంగా ఉన్నారు- సర్పంచ్

గత కొన్ని సంవత్సరాల తర్వాత గ్రామంలో కుంటలు, పెద్ద చెరువు నిండడంతో రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు గ్రామ సర్పంచ్ కల్పన శ్రీనివాసచారి. ప్రతి సంవత్సరం ఇలాగే వర్షాలు కురిసి గ్రామంలో పంటలు బాగా పండాలన్నారు.

ఎక్కువ సంఖ్యలో నాట్లు పెట్టుకోవాలి- MPTC

వర్షాల కోసం అన్నదాతలు అష్టకష్టాలతో ఎదురుచూస్తున్న వేళ జోరువాన పడటం సంతోషకరమన్నారు MPTC కంచి లలిత మల్లయ్య. ఈ క్రమంలోనే గ్రామ దేవతల ఆశీస్సులతో గంగ పూజలు చేసుకున్నామని తెలిపిన ఆమె..ఈ సారి రైతులు అధిక సంఖ్యలో నాట్లు వేసుకుని ఎక్కువ పంటలు పండిచుకుకోవాలని కోరారు.

యాసంగి సాగుకు సన్నద్ధం- మాజీ సర్పంచ్

ఇన్ని రోజులుగా అరకొర వర్షాలతో బాధపడుతున్న రైతాంగం.. శనివారం కురిసిన వానతో యాసంగికి సన్నద్దం అవుతున్నారని తెలిపారు గ్రామ మాజీ సర్పంచ్ రేగు వెంకటేష్.  అలాగే చెరువుపై మత్య్సకారులు ఆధారపడ్డారని వారికి కూడా ఇది మంచి జోవనోపాధి అన్నారు.

పశువులకు మేత దొరుకుతది- పాల సంఘం చైర్మైన్

గ్రామంలో కుంటలు, చెరువులు నిండటంతో పాడి అభివృద్ధి చెందుతుందని తెలిపారు వీరవెల్లి పాల సహకార సంఘం చైర్మన్ బీమరి మచ్చేందర్. పశువులకు మేత దొరకుతుందని తద్వారా పాలు ఎక్కువ ఇస్తాయని తెలిపారు.

చేపల పెంపకం పెరుగుతుంది- మత్య్సకారుడు

గ్రామంలో ఎన్నడూలేని విధంగా కుంటలు, చెరువు నిండటంతో చేపల పెంపకం అభివృద్ధి చెందుతుందన్నారు మత్య్సకారుడు సోకం సాయిలు.

పండుగ చేసుకుంటాం- గ్రామస్థుడు

ఐదు సంవత్సరాల తర్వాత ఇంతపెద్ద వర్షం పడిందన్నారు గ్రామస్థుడు గడ్డమీది అర్జున్. ప్రతి ఏడూ ఇలాగే వర్షం పడితే గ్రామ దేవతలకు పండుగ చేస్కుంటామని తెలిపారు.