రేపు శ్రీరామ నవమి శోభాయాత్ర : భారీ బందోబస్తు

రేపు శ్రీరామ నవమి శోభాయాత్ర : భారీ బందోబస్తు

రేపు హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలై… సాయంత్రంతో ముగుస్తుంది. సీతారాంబాగ్ నుంచి శోభాయాత్ర ప్రారంభమై… హనుమాన్ వ్యాయామ శాల వరకు సాగుతుంది.

శ్రీ రామ నవమి శోభా యాత్రకు నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. GHMC సమన్వయంతో భద్రత ఏర్పాట్లను  పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. లా అండ్ ఆర్డర్, పారామిలటరీ బలగాలతో కలిపి మొత్తం 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.

192 కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి అటాచ్ చేసి ర్యాలీని పరిశీలిస్తామని సీపీ చెప్పారు. 4 ప్రత్యేక కెమెరాలతో.. 360 డిగ్రీస్ టెక్నాలజీతో లైవ్ లో పర్యవేక్షిస్తామని చెప్పారు. సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచామని చెప్పారు సీపీ.