
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. న్కూ ఇయర్ సందర్భంగా పెద్దమ్మ గుడి, టీటీడీ ఆలయం, జగన్నాథ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే ఈ ఆలయాలకు భక్తుల తాకిడి ఉంది. క్రమక్రమంగా ఆ తాకిడి మరింత పెరిగింది.
ఈ క్రమంలో కిలోమీటర్‌కు పైగా వాహనాల రాకపోకలు నిలిచాయి. సీఎం వచ్చే మార్గం కావడంతో ట్రాఫిక్ పోలీసుల అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరుతున్నారు.
మరోవైపు గత రాత్రి న్కూ ఇయర్ వేడకులను నగరవాసులు చాలాగ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హైదరాబాద్ లో రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేపట్టగా ఇద్దరు మహిళలు సహా 1239 మందిపై కేసుల నమోదు చేశారు. 938 ద్విచక్ర వాహనాలు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
కొత్త ఏడాదిని సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగాయి. ఆదివారం సెలవు అయినప్పటికీ మద్యం డిపోలను ఓపెన్‌లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపారు. ఈ నెల 29, 30, 31వ తేదీల్లో ఏకంగా రూ.658 కోట్ల మేర లిక్కర్, బీర్లు అమ్ముడుపోయాయి.