రెండో రోజు లాక్‌డౌన్.. భారీగా ట్రాఫిక్ జామ్‌లు

రెండో రోజు లాక్‌డౌన్.. భారీగా ట్రాఫిక్ జామ్‌లు

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు లాక్ డౌన్ మొదలైంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సర్కార్ నిత్యవసరాల కొనుగోలు కోసం సడలింపు ఇవ్వడంతో రోడ్లపైకి జనం భారీగా వచ్చారు. నిత్యవసరాలు, మాల్స్, సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, వైన్ షాపుల దగ్గర జనం క్యూ కట్టారు. మరోవైపు రేపు రంజాన్ పండగ కావటంతో... ఓల్డ్ సిటీ బస్తీలు ముస్లింలతో కిక్కిరిసి పోయాయి. సరుకులు, బట్టలు కోనేందుకు జనం భారీగా బయటకు వచ్చారు. ఆసీఫ్ నగర్, మదిన, చార్మినార్, యాకత్ పురా, మలక్ పేట్, శాలిబండలోని రోడ్లు జనంతో నిండిపోయాయి. కాగా.. చాలామంది మాస్కులు పెట్టుకోకుండానే తిరుగుతున్నారు. మార్కెట్లలో ఎక్కడా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించడం లేదు. గుంపులు గుంపులుగా పబ్లిక్ తిరుగుతుండడంతో కరోనా వైరస్ మరింత వేగంగా వ్యాపించే చాన్సుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల ట్రాఫిక్ జాం కావటంతో.... లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా రద్దీ కొనసాగుతోంది. దాంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు.

మరోవైపు ఇవాళ్టీ నుంచి మరింత కఠినంగా లాక్‌డౌన్ అమలు చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. ఫస్ట్ డే చూసీ చూడనట్లు వదిలేసినా... నేటి నుంచి మాత్రం అనవసరంగా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బండి సీజ్ చేయటంతో పాటు... కేసులు బుక్ చేస్తామంటున్నారు. లాక్‌డౌన్ టైంలో సడలింపులు ఉన్న వాళ్లు మస్ట్‌గా ఐడీ కార్డ్ చూపించాలని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు  ప్రజలు సహాకరించాలని... అనవసరంగా బయట తిరగవద్దని పోలీసులు కోరుతున్నారు.