టచింగ్ టచింగ్..   ఫుల్ వీడియో సాంగ్‌‌‌‌ రిలీజ్

 టచింగ్ టచింగ్..   ఫుల్ వీడియో సాంగ్‌‌‌‌ రిలీజ్

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘జపాన్’. కార్తికి ఇది 25వ చిత్రం. దీపావళి కానుకగా నవంబర్ 10న  సినిమా విడుదల కానుంది. టీజర్, ట్రైలర్‌‌‌‌‌‌‌‌కు ట్రెమండెస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే జీవీ ప్రకాష్ కంపోజ్ చేసిన పాటలు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి. బుధవారం ఈ మూవీ నుంచి ‘టచింగ్ టచింగ్’ అంటూ సాగే  ఫుల్ వీడియో సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో కార్తి డిఫరెంట్ గెటప్‌‌‌‌లో కనిపిస్తుంటే, అను ఇమ్మాన్యుయేల్ స్టైలిష్ లుక్‌‌‌‌లో ఆకట్టుకుంటుంది.  

సింపుల్ డ్యాన్స్‌‌‌‌ మూమెంట్స్‌‌‌‌తో వీరిద్దరు ఇంప్రెస్  చేస్తున్నారు.   జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన పాటకు ‘హ్యాపీ మూమెంట్.. నో మోర్ కామెంట్..బాడీ డిమాండ్.. టచింగ్ టచింగ్ ’ అంటూ  భాస్కర భట్ల క్యాచీ లిరిక్స్ రాశారు. తమిళంతో పాటు తెలుగులోనూ కార్తి స్వయంగా ఈ పాటను పాడాడు.  ప్రస్తుతం ఈ సాంగ్‌‌‌‌ యూట్యూబ్‌‌‌‌ ట్రెండింగ్‌‌‌‌లో ఉంది. సునీల్ కీలక పాత్ర పోషించగా, సినిమాటోగ్రాఫర్  విజయ్ మిల్టన్ ఈ చిత్రంతో నటుడిగా కనిపించనున్నారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.