- తెలంగాణ, ఏపీలకు కేఆర్ఎంబీ లేఖ
హైదరాబాద్, వెలుగు : టెలిమెట్రీ సిస్టమ్ఫేజ్ 2 అమలుకు నిధులు విడుదల చేయాల్సిందిగా తెలంగాణ, ఏపీలను కేఆర్ఎంబీ కోరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల లెక్కలను కచ్చితంగా అమలు చేయాలన్నా, రెండు రాష్ట్రాలకు లాభం కలగాలన్నా టెలిమెట్రీ సిస్టమ్స్తోనే సాధ్యమవుతుందని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ ఇరిగేషన్ సెక్రటరీ, ఏపీ ఇరిగేషన్ సెక్రటరీలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది.
సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్ (ఎల్డీసీపీ)లతో కూడిన టెలిమెట్రీ స్టేషన్స్ ఫేజ్2 ఏర్పాటుకు 2018 అక్టోబర్16, 2020 జూన్ 4న జరిగిన బోర్డు మీటింగ్లలో నిర్ణయం జరిగిందని వివరించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.6.25 కోట్ల నిధులకు అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చినా నిధులను విడుదల చేయలేదని తెలిపింది. ఎస్ఎల్డీసీపీల ఏర్పాటుకు నిధులను విడుదల చేయాలని ఇరు రాష్ట్రాలను కోరింది.