సీఎం రేవంత్ చొరవతో ..కంటోన్మెంట్​కు నిధులు

సీఎం రేవంత్ చొరవతో ..కంటోన్మెంట్​కు నిధులు
  •     కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ వెన్నెల గద్దర్ 

బషీర్ బాగ్, వెలుగు :  గత బీఆర్ఎస్ ప్రభుత్వం10 ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షణీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జ్ జి.వి.వెన్నెల గద్దర్ తెలిపారు.  బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తన విజ్ఞప్తి మేరకు పెండింగ్ లోని రూ.48 కోట్ల50 లక్షలు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. 

ఇందుకు కంటోన్మెంట్ బోర్డు తరపున సీఎంకు కృతజ్ఞతలు చెప్పారు.  విడుదలైన నిధులను బోర్డు ఎంప్లాయీస్ కు  జీతాలుగా చెల్లించాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం10 ఏండ్ల సర్వీస్ ట్యాక్స్ రూ.800 కోట్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన 33 ఎకరాల భూమిని ఎలాంటి విలువ కట్టకుండా ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని కోరారు.