
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హౌజింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీకి ఈసారి బడ్జెట్లో రూ.2,600 కోట్లు కేటాయించారు. ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌తోపాటు పార్లమెంట్, సుప్రీంకోర్టు నాన్‌రెసిడెన్షియల్ బిల్డింగ్‌ల నిర్మాణం చేపట్టేందుకు ఆర్థిక మంత్రి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చారు. మినిస్ట్రీకి గత బడ్జెట్లో రూ.1,833.43 కోట్లు కేటాయించగా ఈసారి గతంతో పోలిస్తే రూ.767.56 కోట్లు అదనంగా కేటాయించారు. కాగా, రెసిడెన్షియల్ పర్పస్ కోసం హౌజింగ్అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్ట్రీకి మరో రూ.873.02 కోట్లు కేటాయించారు.