చిన్నారి ఆప‌రేష‌న్ కు రూ. 14.3 కోట్లు స‌మీక‌ర‌ణ‌

V6 Velugu Posted on May 26, 2021

పూణె: చిన్నారి ఆప‌రేష‌న్ కోసం ఏకంగా రూ.14.3 కోట్లు ఫండ్ రైజ్ చేసిన మిలాప్ యాప్ పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.  పూణెకు చెందిన 11 నెలల బాలిక వేదికా షిండేకు అత్యంత అరుదైన జన్యు లోపం ఎస్‌ఎంఏ టైప్‌-1ఆమెకు ఉందని డాక్ట‌ర్లు గుర్తించారు. రెండు సంవత్సరాల వయసు వచ్చే నాటికే చిన్నారి ప్రాణాలను బలిగొనే ప్రాణాంతక వ్యాధి అన్నారు. తొలి దశలోనే వేదికాలో ఉన్న లోపం గుర్తించడం వల్ల, జీన్‌ రీప్లేస్ మెంట్‌ థెరఫీ చేస్తే ఆ చిన్నారి కోలుకుంటుందన్న ఆశాభావాన్ని డాక్టర్లు వ్యక్తం చేశారు. ఈ ట్రీట్ మెంట్ కు రూ. 16 కోట్ల వ‌ర‌కు (2.1 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) ఖర్చు కావడంతో పాటుగా ఈ ఔషదాన్ని అత్యవసరంగా దిగుమతి చేసుకోవడం ద్వారా పాపను కాపాడుకోవచ్చన్నారు. దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్న చిన్నారుల త‌ల్లిదండ్రుకు మిలాప్ యాప్ అండ‌గా నిలిచింది. వెంట‌నే  మిలాప్‌ వేదికపై డ‌బ్బు కోసం తల్లిదండ్రులు కోర‌గా ప్రపంచవ్యాప్తంగా 1,34,000 మంది దాతలు స్పందించి 14.3 కోట్ల రూపాయలను డొనేట్ చేశారు. 


వేదికా తల్లిదండ్రులు తమ కథను ఫండ్‌ రైజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ మిలాప్‌పై వెల్లడించడంతో పాటుగా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆన్ లైన్‌ దాతలను సహాయపడాల్సిందిగా కోరారు. ఈ ఫండ్‌ రైజర్‌ను మార్చి 2021లో ఏర్పాటుచేయగా.. ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా భారీ స్పందన లభించింది. మూడు నెలల్లోనే 14.3 కోట్ల రూపాయలు వ‌చ్చాయి. మిలాప్ పై నిర్వహించిన క్యాంపెయిన్ కు మద్దతునందిస్తూ దాతలు సహృదయంతో అందించిన విరాళాల ద్వారా సమీకరించగలిగారు. ఈ పాప తల్లిదండ్రులు విజయవంతంగా ప్రభుత్వ అధికారుల నుంచి పన్నులు, దిగుమతి సుంకాలను మినహాయింపు పొందారు. డాక్టర్లు ఇప్పటికే జీన్‌ రీప్లేస్ మెంట్‌ థెరఫీ కోసం యుఎస్‌ ఫార్మాస్యూటికల్‌ కంపెనీకి తమ అభ్యర్థనను పంపించారు. వేదికా, తన తొలి పుట్టిన రోజును జూన్‌లో జరుపుకోవడానికి ముందుగానే చికిత్సను పొందాల్సి ఉంది. ఈ కారణం చేత తప్పనిసరిగా కొన్ని పరీక్షలను ఈ ఔషదాన్ని తనకోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దుకునేందుకు చేయించుకోవాల్సి ఉంది. ఈ ఔషదం జూలై2వతేదీ నాటికి భారతదేశానికి రానుందని, జూలై 7-10వ తేదీల లోపు వేదికాకు చికిత్స జరుగుతుందని తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా దాత‌లంద‌రికీ చిన్నారి త‌ల్లిదండ్రులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Tagged children, operation, , Funds Raising, Milaap

Latest Videos

Subscribe Now

More News