- ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
దౌల్తాబాద్, వెలుగు: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలో దౌల్తాబాద్ మండల కాంగ్రెస్నాయకులు బుధవారం ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
మండల పరిధిలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి, మాచిన్‌పల్లి సర్పంచ్ నాగరాజు, టీపీసీసీ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి గణేశ్పంచమి తదితరులు పాల్గొన్నారు.
