
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: నియోజకవర్గంలో గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా భారీగా నిధులు తీసుకొస్తానని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధిలోని అనాజ్ పూర్, గుంతపల్లి, మజీద్ పూర్ గ్రామాల్లో రూ.80 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అర్హులైన వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.
గత ప్రభుత్వం గ్రామాలను విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, కరిమెల వెంకటేశ్, మేడిపల్లి బాలమ్మ వెంకటేశ్, ధన్ రాజ్ గౌడ్, బాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.