ముగిసిన కందికొండ అంత్యక్రియలు

ముగిసిన కందికొండ అంత్యక్రియలు
  • కందికొండ కడసారి చూపునకు తరలివచ్చిన అభిమానులు, రచయితలు, కళాకారులు

వరంగల్ జిల్లా: ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి అంత్యక్రియలు ముగిశాయి. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నాగుర్లపల్లిలో వేలాది మంది అశ్రునయనాల మధ్య కందికొండ అంత్యక్రియలు జరిగాయి. కందికొండ చితికి నిప్పంటించారు ఆయన కొడుకు ప్రభంజన్. కందికొండ పార్థివదేహాన్ని కడసారి చూసేందుకు రచయితలు,కళాకారులు, అభిమానులు, గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు.
కవులు,కళాకారులు కందికొండ అంతిమయాత్రలో పాల్గొని జానపద పాటలు పాడారు. కోలాటాలు ఆడారు. కందికొండ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాల కిషన్ కందికొండ పాడె మోశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాసు సురేష్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ బోలే షావలి, రచయితలు, కళాకారులు, కందికొండ స్నేహితులు, అభిమానులు, గ్రామప్రజలు అంతిమయాత్రలో  పాల్గొన్నారు. 

 

ఇవి కూడా చదవండి

పాట ఉన్నన్ని రోజులు కందికొండ బతికే ఉంటారు

బాహుబలి 3పై జక్కన్న ఆసక్తికర కామెంట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్