
- మహాప్రస్థానంలో ముగిసిన అంత్యక్రియలు
హైదరాబాద్, వెలుగు: హైకోర్టు జడ్జి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని అంత్యక్రియలు సోమవారం జూబ్లిహిల్స్ లోని మహాప్రస్థానంలో ముగిశాయి. ప్రియదర్శిని భౌతిక కాయానికి ఆమె కుమారుడు దహన సంస్కారాలు చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ రామకృష్ణరావు, డీజీపీ జితేందర్, ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, హైకోర్టు జడ్జీలు, న్యాయవాదులు ఆమెకు నివాళులు అర్పించారు. ప్రియదర్శిని కుటంబసభ్యులను సీఎం పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.