ఓల్డ్‌సిటీ, వెలుగు: క్రీడల వల్ల స్టూడెంట్స్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్గౌడ్అన్నారు. మంగళవారం లాల్ బహదూర్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ జూడో అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో రెండో రోజు నిర్వహించిన సబ్ జూనియర్ చాంపియన్‌షిప్ అండర్55 కేజీల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్ల అమలుతో పాటు క్రీడల రిజర్వేషన్లనూ పెంచుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అజీజ్, ఫరూఖి తదితరులు పాల్గొన్నారు.
