
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షుడిగా జి.రాజగోపాల్, ప్రధాన కార్యదర్శిగా కె.మురళీ మోహన్ ఎన్నికయ్యారు. 2025 –2027 కాలానికి సంఘం ఎన్నికలు ఈ నెల 19న జరిగాయని,
ఓట్ల లెక్కింపు ఆదివారం జరిగిందని హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఎన్నికల అధికారి ఎస్.శశిధర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.రాజగోపాల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మహిళా ప్రతినిధిగా జె.మైత్రేయి, వైస్ ప్రెసిడెంట్–1గా డి.దుర్గా ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్–2గా జి.వేణు, వైస్ ప్రెసిడెంట్ (మహిళ)గా పి.లక్ష్మి శారద, సిహెచ్. సంపత్, పి.శ్రీదేవి, ఎం.రాజు, జాయింట్ సెక్రటరీలుగా జె.ఉపేందర్ రావు, గౌస్ పాషా, కల్పన ఖుష్బూ, గోపి కృష్ణ, పూజ, హిమబిందు మొత్తం 12 మంది కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారు.