
బీసీసీఐకి HCA ప్రతినిధిగా జీ. వివేక్ వెంకటస్వామి ఎన్నికయ్యారు. ఉప్పల్ స్టేడియంలో జరిగిన HCA ఏజీఎం సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. గంటన్నర పాటు జరిగిన భేటీకి 211 మంది క్లబ్ మెంబర్లు హాజరయ్యారు. లోదా కమిటి రూల్స్ ప్రకారం అంబుడ్స్ మెన్ గా జస్టిస్ ఎంఎన్ రావు, రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మాజీ ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ ను ఎన్నిక చేశారు. HCA ఎన్నికలను సెప్టెంబర్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహించాలని ఏజీఎం సమావేశంలో నిర్ణయించారు.