
Jio New Recharge Plan: గడచిన కొన్ని నెలలుగా ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో కొత్త కస్టమర్లను ఆకర్షించటంలో కొంత వెనకబడింది. దీనికి కారణం అనంత్ అంబానీ పెళ్లి తర్వాత పెంచిన టారిఫ్స్. ఈ కాలంలో చాలా మంది బీఎస్ఎన్ఎల్ కి మారిపోయారు. అయితే ప్రస్తుతం జియో దాదాపు 46 కోట్ల మంది మెుబైల్ యూజర్లను కలిగి ఉంది. ఈ క్రమంలోనే తన యూజర్ బేస్ పెంచుకునేందుకు అంబానీ సరికొత్త ప్లాన్ ప్రకటించి టెలికాం రంగంలో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నారు.
రిలయన్స్ జియో ఇప్పటి వరకు ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించే యూజర్లను టార్గెట్ చేస్తూ అనేక రీఛార్జ్ ప్లాన్లను డిజైన్ చేసిన సంగతి తెలిసింది. అయితే తాజాగా బేసిక్ మెుబైల్ యూజర్లకు అందుబాటులో కూడా 11 నెలల కాలానికి రూ.వెయ్యి కంటే తక్కువ ఖర్చులో కొత్త రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువ కాలం వ్యాలిడిటీ ప్లాన్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా కంపెనీ దీనిని తీసుకొచ్చిందని తెలుస్తోంది.
రూ.895 ప్లాన్ పూర్తి వివరాలు..
- ప్లాన్ వ్యాలిడిటీ 336 రోజులు
- ప్లాన్ కింద దేశవ్యాప్తంగా అన్ని మెుబైల్ నెట్‌వర్క్స్‌కి అల్‌లిమిటెడ్ కాల్స్ ప్రయోజనం
- ప్రతి నెల 2జీబీ చొప్పున హైస్పీడ్ ఇంటర్నెట్, మెుత్తం 24జీబీ డేటా అందించబడుతోంది
- రోజుకు 50 ఎస్ఎంఎస్ చొప్పున ఉచితంగా అందించబడతాయి
ప్రస్తుతం రిలయన్స్ జియో లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్ ద్వారా మార్కెట్లో ఇతర పోటీదారులైన ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియాలకు గట్టిపోటీ ఇవ్వాలని చూస్తోంది. ప్రస్తుతం పైన పేర్కొన్న రీఛార్జ్ ప్లాన్ జియో, జియో భారత్ మెుబైల్ యూజర్ల కోసం తీసుకురాబడింది. అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు ప్రస్తుతం ఈ ప్లాన్ అందుబాటులో ఉండదని కంపెనీ వెల్లడించింది.
►ALSO READ | Defence Stock: సోమవారం గర్జించనున్న డిఫెన్స్ స్టాక్ ఇదే.. మెగా డీల్, మీ దగ్గర ఉందా?