పెట్రో దోపిడీ కేసీఆర్ ది.. నిందలు కేంద్రంపైనా..? : వివేక్ వెంకటస్వామి

పెట్రో దోపిడీ కేసీఆర్ ది.. నిందలు కేంద్రంపైనా..? : వివేక్ వెంకటస్వామి

ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై చేసిన కామెంట్స్ పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకటస్వామి స్పందించారు. రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా కరెంటు చార్జీల నుంచి ఆర్టీసీ చార్జీల వరకూ అన్నింటినీ పెంచి నిరుపేదలను నిలువు దోపిడీ చేస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వంపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. పెట్రో ధరలపైనా పదేపదే అబద్దాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కేసీఆర్ కు బాగా అలవాటుగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి వసూలు చేయని విధంగా పెట్రోల్, డీజిల్ పై కేసీఆర్ వసూలు చేస్తూ.. ఆ నెపం కేంద్రంపై నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధరలు

పైన పేర్కొన్న పెట్రోల్, డీజిల్ ధరలు 2023 జనవరి 19 నాటివి

బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కంటే తెలంగాణలోనే పెట్రోల్, డీజిల్ పై ఒక లీటర్ కు దాదాపు 14 రూపాయల వరకు తేడా ఉందని జి.వివేక్ వెంకటస్వామి వివరించారు. దేశానికే తెలంగాణ ఆదర్శమని పదే పదే చెబుతున్న కేసీఆర్ పాలనలో అన్ని రాష్ట్రాల కంటే లీటర్ పెట్రోల్, డీజిల్ పై 14 రూపాయలు ఎక్కువ ఖర్చుపెట్టి ప్రజలు కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ సంక్షోభాలు, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం లాంటి కారణాలతో పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరిగినా.. సామాన్యులపై భారం పడకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జి.వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. కేంద్రం రెండు సార్లు పెట్రోలు, డీజిల్ పై సెస్ భారీగా తగ్గించిందని గుర్తు చేశారు. ఆదాయం కోల్పోతున్నా భరిస్తూ మధ్యతరగతికి ఊరట కలిగేలా కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుందని చెప్పారు.

కేసీఆర్ మాత్రం పెట్రోల్, డీజిల్ పై అధికంగా పన్నులు వసూలు చేస్తున్నారని జి.వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఇచ్చిన హామీలను విస్మరించి.. దేశాన్ని ఉద్దరిస్తామని పదేపదే చెబుతున్న కేసీఆర్.. ధరల భారం మోపినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. పెట్రోలు, డీజిల్ పై చార్జీలను లీటరుకు 10 రూపాయలకుపైగా తగ్గించాలని డిమాండ్ చేశారు.