ఆ మూడు రోజులు సెలవులు ఇవ్వండి : పోలీస్ శాఖ రిక్వెస్ట్

ఆ మూడు రోజులు సెలవులు ఇవ్వండి : పోలీస్ శాఖ రిక్వెస్ట్

త్వరలో దేశ రాజధాని ఢిల్లీలో  జీ 20 సమ్మిట్   జరగనుంది. ఈ క్రమంలో భద్రతా కారణాల దృష్ట్యా  సెప్టెంబర్ 8 నుండి 10 వరకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలంటూ  ఢిల్లీ పోలీస్ శాఖ  ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని కోరింది. వాణిజ్య,  వ్యాపార సంస్థలకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.  సమ్మిట్ సమయంలో  నియంత్రిత జోన్లలో మూసివేయబడతాయని చెప్పారు.

రెండు రోజులు G20 సమ్మిట్

సెప్టెంబరు 9-10 తేదీల్లో రెండు రోజుల పాటు  జీ20 సదస్సు జరగనుంది. ప్రగతి మైదాన్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన కన్వెన్షన్ సెంటర్‌లో సమ్మిట్ జరగనుంది. అయితే, షెర్పా సమావేశాలు , ఫైనాన్స్, ఎనర్జీ , సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశాలతో సహా సంబంధిత ఈవెంట్‌లు సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతాయి.ఈ  ఈవెంట్  గెస్టుల బస కోసం నగరం అంతటా  దాదాపు 23 హోటళ్ళు  బుక్ చేశారు.

ఆగస్టు 20న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జి) వికె సక్సేనా సమ్మిట్‌కు సంబంధించిన సన్నాహాలను పరిశీలించారు, నిర్దిష్ట ప్రదేశాలలో ట్రాఫిక్ రద్దీ సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, ఏరోసిటీలోని పలు హోటళ్లను,  భికాజీ కామా ప్లేస్ సమీపంలోని ఒక హోటల్‌ను, మథుర రోడ్డు సమీపంలోని మరో హోటల్‌ను కూడా ఆయన తనిఖీ చేశారు.