ఫర్నిచర్ ఉన్న ఇళ్లే అతని టార్గెట్.. జర జాగ్రత్త

ఫర్నిచర్ ఉన్న ఇళ్లే అతని టార్గెట్.. జర జాగ్రత్త

ఫర్నీచర్ తో ఉన్న రెంటెండ్ హౌస్ లను టార్గెట్ గా చేసుకుని అందులో రెంట్ కి దిగి వస్తువులను కొట్టేస్తున్న ఇద్దరిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్లో ఉండే ఫర్నిచర్ ఇండ్లనే టార్గెట్ గా చేసుకొని నకిలీ అధార్ కార్డులు, నకిలీ పేర్లు సృష్టించి ఇంట్లో రెంట్ కు దిగి ఆ తర్వాత ఇంట్లోని విలువైన వస్తువులను దొంగలించిన వ్యక్తిని, అతడికి సహకరించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ వెంకటేశ్వ ర్రావు వివరాలు వెల్లడించారు.

జల్సాల కోసం దొంగగా మారి… ప్రకాశం జిల్లా ఒంగోలుకి చెందిన ధూళిపూడి శి వప్రసాద్ కుమారుడు డి. శ్రీవాత్సవ(30) కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో ఉండేవాడు. 2010 లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. అనంతరం 4 ఏండ్ల పాటు బెంగూళురులోని వోల్వో బస్ సర్వీస్ సెంటర్లో సర్వీస్ ఇంజనీర్ గా పనిచేశాడు. సరూర్నగర్ హుడా కాంప్లెక్స్ అశ్రే య అపార్ట్ మెంట్లో ఉండే సాంజ రాజ్ కుమార్(43) స్థానికంగా ఎలక్ర్టానిక్స్ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరికి 2013లో పరిచయం ఏర్ప డింది. జల్సాలకు అలవాటు పడ్డ శ్రీవాత్సవకు తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలనే ఆశ కలిగింది. ఫర్నిచర్ ఉన్న రెంటెండ్ ఇండ్లే టార్గెట్ ఫర్నిచర్తో కూడిన అద్దె ఇంటి కోసం ఆన్ లైన్ లో యాడ్స్ చూసి ఇంటి ఓనర్ కి ఫోన్ చేస్తాడు శ్రీవాత్సవ.

తాను ఎరోనాటికల్ ఇంజనీర్ అని ఎయిర్ ఇండియాలో పైలట్ గా పనిచేస్తున్నాను నెల కు రూ. 4లక్ష ల జీతం వస్తుందని ఓనర్ కి చెబుతాడు . ఆ తర్వాత నకిలీ వివరాలతో కూడిన అధార్ కార్డును పంపిస్తాడు. ఇంటి అద్దెకు సంబంధించి డబ్బులను ఓనర్ ఖాతాలో జమచేసినట్టుగా ఓ ఫేక్ బ్యాంక్ రసీదును క్రియేట్ చేసి వాట్సప్ లో  పంపిస్తాడు. డబ్బులు యూకే నుంచి రావాలి కాబట్టిరెండు, మూడు రోజుల్లో అకౌంట్లో డబ్బులు డిపాజిట్ అవుతాయని చెప్పి శ్రీవాత్సవ ఇంట్లోరెంట్ కు దిగుతాడు. ఆ తర్వాత ఇంట్లోని విలువైన ఎలక్ర్టానిక్ వస్తువులు, ఫ్రిజ్లు, ఎల్ఈడీ టీవీలు, హోమ్ థియేటర్లను దొంగిలిస్తాడు. వాటిని సాంబ రాజ్ కుమార్ కు తక్కువ ధరకు అమ్మేస్తాడు.

ఆక్టోబర్ 15న శ్రీవాత్సవ ఆన్లైన్లో విత్ ఫర్నిచర్ ఇంటి కోసం గాలించగా గచ్చిబౌలిలోని గోల్ఫ్ ఎడ్జ్ అపార్ట్ మెంట్లోని కేశవరావు హౌస్ కనిపించింది. ఆ ఇంట్లోరెంట్ కి దిగిన తర్వాత శ్రీవాత్సవ విడతల వారీగా ఇంట్లోని ఫ్రిజ్, టీవీలను ఆక్టోబ ర్ 17, 25,27 తేదిల్లో బయటకు తీసుకువెళ్లాడు. అనంతరం ఇంట్లోనుంచి 30న శ్రీవాత్సవ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇంటి రెంట్ ఇవ్వకుండా శ్రీవాత్సవ వెళడంతో అనుమానంతో కేశవరావు లోపలికి వెళ్లి పరిశీలించాడు. ఎలక్ర్టాని క్ వస్తువులు మొత్తం చోరీకి గురైనట్లు గమనించాడు. ఈ నెల 17న గచ్చిబౌలి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీవాత్సవను కూకట్ పల్లిలో అదుపులోకి తీసుకున్నారు. అతడికి సహకరించిన రాజ్ కుమార్ను సైతం అరెస్ట్ చేశారు. రూ.4 లక్షల విలు వైన 5 సామ్సంగ్ టీవీలు, 8 సెల్ ఫోన్స్, ప్రొజెక్టర్, స్క్రీన్, రిఫ్రిజిరేటర్, హోం థియేటర్, ల్యాప్టాప్, ఎండీవర్కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.